LIVE : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY SESSION LIVE
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2025, 11:04 AM IST
Assembly session On Caste Census Survey : సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేయనున్నారు. అంతకంటే ముందే అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం కానున్న మంత్రివర్గం కుల గణన సర్వే, ఎస్సీ కమిషన్ నివేదికలపై చర్చించి ఆమోదం తెలపనుంది. అధికారంలోకి వస్తే సామాజిక వర్గాల వారీగా ఎంత జనాభా ఉంటే ఆ మేరకు నిధులు, మెరుగైన అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందుకోసం కులగణన చేపడుతామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో లక్ష మంది అధికార యంత్రాంగంతో కుల గణన సర్వేను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలోని వివరాలను మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే వెల్లడించింది. ఈ నివేదికను అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి చర్చించి ఆమోదించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపైనా సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది.