పొత్తులో భాగంగానే పవన్ అభ్యర్థుల్ని ప్రకటించారు: బొండా ఉమా - Babu Surity Bhavishattu Gaurantee
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 6:15 PM IST
TDP Polit Bureau Leader Bonda Fires On YSRCP: టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ముందుగా అనుకున్న రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాలకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పవన్ ప్రకటనపై టీడీపీకి అభ్యంతరం లేదని, పొత్తులో అభిప్రాయభేదాలకు తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసమే టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకున్నాయని, జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్కటయ్యారని తెలిపారు.
Bonda Uma Maheswarrao Babu Surity Bhavishattu Gaurantee Program: శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం బొండా నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం పొత్తుపై వైఎస్సార్సీపీ నాయకులు ఫ్యాంట్లు తడుపుకుంటున్నారని విమర్శించారు. పొత్తులపై తాము స్పందించాల్సింది పోయి వైసీపీ నాయకులు స్పందించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.