తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పుపై మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు హామీ ఇవ్వలేదు: టీడీపీ
🎬 Watch Now: Feature Video
TDP on EX MLA Shankar Yadav Ticket Issue: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పుపై వస్తున్న ప్రచారాన్ని టీడీపీ అధిష్ఠానం కొట్టివేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత తదుపరి చర్యలు, అభ్యర్థుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పుపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది.
EX MLA Shankar Yadav మంగళవారం ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును తంబళ్లపల్లి నేతలు కలిశారు. ఆయనను కలిసిన అనంతరం టిక్కెట్ శంకర్ యాదవ్‌కే అంటూ ఆయన అనుచరులు స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి ప్రచారంపై స్పందించిన టీడీపీ పెద్దలు ఆ ప్రచారాన్ని కొట్టిపడేశారు. పార్టీ కోసం పని చేయాలని శంకర్ యాదవ్‌కు చంద్రబాబు సూచించారని ఆ పార్టీ వర్గాలు తేల్చిచెప్పాయి. టీడీపీ తొలి జాబితాలో తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత అభ్యర్థుల టిక్కెట్ల కేటాయింపు జరిగిందని, ఇక మార్పులు చేర్పులు ఉండవని మరోసారి స్పష్టం చేసింది.