ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ప్లాన్​- టీడీపీ శ్రేణులపై బైండోవర్‌ కేసులు - టీడీపీ శ్రేణులపై బైండోవర్‌ కేసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 4:51 PM IST

TDP MLC Bhumireddy Ram Gopal Reddy Comments on YSRCP Govt : ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలోని తెలుగుదేశం శ్రేణులపై ఉద్దేశపూర్వకంగా బైండోవర్‌ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ (MLC) భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కలెక్టర్‌ విజయరామరాజును కలిసి ఫిర్యాదు చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులను వదిలేసి తెలుగుదేశం నేతల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ వారిని స్టేషన్​కు పిలిపించి బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. అరాచకాలు, దందాలు, దౌర్జన్యాలు చేసిన వైఎస్సార్సీపీ వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్పొరేటర్లకు ఇష్టారాజ్యంగా గన్ లైసెన్సులు మంజూరు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై 8 నెలల కిందట ఆర్టీఐ ద్వారా జిల్లాలో ఎంతమందికి గన్ లైసెన్సులు మంజూరు చేశారని కోరితే అధికారుల నుంచి ఇంతవరకు స్పందన లేదన్నారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులు తుపాకులు పట్టుకుని తిరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.