చంద్రబాబు జపం చేయడానికే 'సిద్ధం' సభ పెట్టినట్లుంది: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి - టీడీపీ ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 10:29 AM IST
TDP MLC Bhumireddy Fires on YSRCP Government: సీఎం జగన్ రాప్తాడు సభ ఆత్మస్తుతి, పరనింద అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు(Chandrababu) జపం చేయడానికే జగన్(Jagan) సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. రాయలసీమ(Rayalaseema)లో సభ పెట్టి సీమకు చేసిన మంచిని చెప్పుకోలేని దీనస్థితి జగన్‌దని దుయ్యబట్టారు. సీమలో ఇన్ని వేల ఎకరాలకు నీళ్లిచ్చానని, కొత్త ప్రాజెక్టులు కట్టానని, కొత్త పరిశ్రమలు తెచ్చానని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రైతులకు ఏం మేలు చేశారో రాయలసీమ ప్రాంత వాసులే చెబుతారని భూమిరెడ్డి స్పష్టం చేశారు. రైతులు సంతోషంగా ఉంటే ఎందుకు పులివెందుల(Pulivendula)లోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నించారు.
కడప(kadapa) స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేదో సభలో చెప్పలేదని ఆక్షేపించారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం కాదు జగన్‌కు ఆంధ్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన తేల్చి చెప్పారు. పరిపాలన బాగుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే(MLA) అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. 57 నెలలు ప్రజలను గాలికి వదిలేసి ఎన్నికల సమయం దగ్గరపడటంతో సీఎంకు ప్రజలు గుర్తుకొచ్చారని ఆయన విమర్శించారు.