పవన్‌ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు- పిఠాపురంలో జనసేనాని గెలుపు తధ్యం: వర్మ - Pawan kalyan met varma - PAWAN KALYAN MET VARMA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 10:15 PM IST
TDP Leader Varma fire on YSRCP Leaders : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఉగాది వేడుకల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్లొన్నారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పిఠాపురం నుంచి పవన్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మీడియా సమావేశంలో వర్మ తెలిపారు. పిఠాపురంలో ప్రతి మండలానికి ఆసుపత్రి, టెంపుల్ టూరిజానికి 500 కోట్లు, ఎస్ఈజెడ్లో 30 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు, పవన్ ఎం చేస్తారో చెప్పి ఓట్లను అభ్యర్థిస్తున్నామని వర్మ అన్నారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత, ఆ పార్టీ నేత దొర బాబు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును ఆపేశారని, ఏలేరు ఆదునీకీకరణ పనులు పక్కన పెట్టారని వర్మ ఆరోపించారు. దీంతో పిఠాపురం రైతులకు 6 వందల కోట్ల నష్టం జరిగిందని మండిపడ్డారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీళ్లను తాండవకు తరలించేదుకు 750 కోట్లకు వంగా గీత, దొర బాబు కాంట్రాక్టు ఇచ్చారని, అందులో 25 కోట్ల కమిషన్‌కు ఆ ప్రాజెక్టుకు సంతకం పెట్టి పిఠాపురం రైతుల హక్కులు తాకట్టుపెట్టారని, తమ ప్రాంతానికి రావల్సిన నీటిని మళ్లించారని ఆరోపించారు. పవన్‌ను ఓడించేందుకు కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నారని, వైసీపీ నేతలు ఎంతమంది వచ్చిన పవన్‌ను గెలిపించుకుంటామని వర్మ స్పష్టం చేశారు.