సీఎస్​గా జవహర్ రెడ్డి ఉంటే మూర్తి యాదవ్ ప్రాణానికి హాని: టీడీపీ - VARLA RAMAIAH COMMENTS ON CS - VARLA RAMAIAH COMMENTS ON CS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 5:10 PM IST

Varla ramaiah comments on CS Jawahar Reddy: సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే మూర్తి యాదవ్ (Murthy Yadav) ప్రాణానికి హాని ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు, విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లకు ఇతనెలా తెలుసని ఆయన నిలదీశారు. అధికారులపై ఆరోపణలు వస్తే పాలన యంత్రాంగం, ఏసీబీ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. వెంటనే ఎంక్వైరీ వేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోమని చెబుతారన్నారు. ఇప్పుడు చేతులు అన్ని సీఎస్ వైపు చూపిస్తున్నాయని వర్లరామయ్య ఆరోపించారు. 

(CS Jawahar Reddy పెద్దసార్ చుట్టూ భూ మాఫియా తిరుగుతుందని వర్ల ఆరోపించారు. సీఎస్, అతని కుమారుడు భూములు కొట్టేశారని మూర్తి యాదవ్ ఆరోపిస్తే సీఎస్ ఎందుకు స్పందించడం లేదన్నారు. అతనిపై సీఐడీ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. విశాఖ పరిసర ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు లాక్కునే ప్రయ్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గవర్నర్ సీఎస్ పై చర్యలకు ఆదేశించాలని వర్ల డిమాండ్ చేశారు. సీఎస్ పదవి నుంచి జవహర్ రెడ్డి పక్కనపెట్టి విచారణకు ఆదేశించాలని కోరారు. ఏపీలో భూ దందాపై ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలన్నారు. ఏసీబీలో నిజాయతీగలిగిన అధికారికి ఆ కేసును అప్పగించాలని వర్లరామయ్య డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.