మద్య నిషేధం హామీ మర్చిపోయాడు - అమ్మకాలు ఐదు రెట్లు పెంచేశాడు : జగన్పై రామాంజనేయులు ధ్వజం - TDP Ramanjaneyulu Fire on CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 11:16 AM IST
TDP Leader Ramanjaneyulu Fire on CM Jagan : మోసపూరిత మాటలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జీ రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా కాకుమానులో జయహో బీసీ కార్యక్రమం (Jayaho BC Programme)లో ఆయన పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు నృత్యాలు చేస్తూ కోలాహలం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు.
Jayaho BC Programme At Gunture District : గతంలో ప్రతీ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చే మద్యం ఆదాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరలు పెంచడంతో 30,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రామాంజనేయులు తెలిపారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే చేసిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో కనీసం 10 వేల కోట్లు పోలవరానికి ఖర్చు చేసినా రైతులకు నీరు వచ్చేదని అన్నారు. అన్ని రకాల కార్పొరేషన్లు రద్దు చేశారని ఆరోపించారు.