జగన్ పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు - ప్రజలపై రూ.27 వేల కోట్లు భారం: పట్టాభి - PATTABHI FIRES ON CM JAGAN - PATTABHI FIRES ON CM JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 8:55 PM IST
TDP Leader Pattabhi Fires on CM Jagan: సీఎం జగన్ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి అక్షరాలా 27,442 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) మండిపడ్డారు. 2019లోని విద్యుత్ బిల్లు కంటే 2024లోని విద్యుత్ బిల్లులు రెండు, మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి తన అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టినందు వల్లే నేడు రాష్ట్ర ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు. ఆర్ఈసీ నుంచి తీసుకున్న అప్పులకు నెలవారీ వడ్డీలే 1516 కోట్లు బకాయి పడ్డారని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరంతర బాధుడుని నిర్వర్యంగా కొనసాగిస్తున్నారని పట్టాభిరామ్ అన్నారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై అధిక భారం మోపిన ఏకైక వ్యక్తిగా జగన్ నిలుస్తారని ఆయన విమర్శించారు. ఐదు సంవత్సరాలలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఆ డబ్బును అమ్మఒడి పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారని పట్టాభిరామ్ మండిపడ్డారు.