పరిశ్రమల భూముల్లో వైసీపీ కార్యాలయాలా? అక్రమాలపై నిగ్గు తేలుస్తాం: నరసింహ యాదవ్ - Narasimha Yadav Fires on YSRCP - NARASIMHA YADAV FIRES ON YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 4:05 PM IST

TDP Leader Narasimha Yadav on YSRCP Offices : వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయాల గోడపత్రికలను ఆయన ప్రదర్శించారు. రాజప్రసాదాలవలే కట్టడాలను కడుతున్నారని ఆరోపించారు. తద్వారా వారి సంస్థలకు భారీ ఎత్తున్న ప్రజాధనాన్ని కేటాయించుకొని దుర్వినియోగం చేశారని నరసింహ యాదవ్​ ఆక్షేపించారు.

రేణిగుంట విమానాశ్రయం సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన ఏపీఐఐసీ భూముల్లో రెండు ఎకరాలను ఆ పార్టీ కార్యాలయానికి కేటాయించారని నరసింహ యాదవ్ ఆరోపణలు చేశారు. సంవత్సరానికి వెయ్యి రూపాయలు అద్దెతో ఆ స్ధలాన్ని కేటాయించడాన్ని ​ తప్పుబట్టారు. పార్టీ కార్యాలయాల పేరుతో ఎకరాలకు ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇతర అక్రమాలపై నిగ్గు తేల్చే దిశగా కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేయిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నింటిని కూటమి సర్కార్ అంచెలంచెలుగా అమలు చేస్తుందని నరసింహ యాదవ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.