ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి రామోజీరావు : నారా లోకేశ్ - TDP Nara Lokesh About Ramoji Rao Demise - TDP NARA LOKESH ABOUT RAMOJI RAO DEMISE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-06-2024/640-480-21671320-thumbnail-16x9-lokesh-on-ramoji-death.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 9, 2024, 2:18 PM IST
TDP Leader Nara Lokesh About Ramoji Rao Demise : సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రామోజీరావు అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన లోకేశ్ రామోజీరావు తనలాంటి అనేక మంది యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజలకు అండగా ఉంటూ వారి కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావుది అని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదని తెలిపారు. ఆయన ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని లోకేశ్ కొనియాడారు. ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకు రావాలని రామోజీరావు తనకు నిత్యం ఇచ్చే సూచనలు ఎన్నటికీ మరువనన్నారు. అంతటి మహనీయుడు ఇప్పుడు మన మధ్య లేకపోవటం ఎంతో బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.