తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త దారుణహత్య- కొడవలితో నరికి చంపిన దుండగులు - TDP Activist Murder - TDP ACTIVIST MURDER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 12:46 PM IST
TDP Activist Murder Case: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నందలపాడులో తన ఇంటిపై నిద్రిస్తున్న లాల్ బాషా అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొడవలితో నరికి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. టీడీపీలో లాల్ బాషా కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని తోటి కార్యకర్తలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని ఆరోపించారు. గతంలోనూ లాల్ బాషాను వైఎస్సార్సీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు కోణాల్లో పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
"లాల్ బాషా టీడీపీ కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఈ నేపథ్యంలో గతంలో వైఎస్సార్సీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు. ఇప్పడు కూడా వైఎస్సార్సీపీ నాయకులే ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని భావిస్తున్నాం." - టీడీపీ కార్యకర్తలు