జగన్ అరాచకాలపై లోకేశ్ ఎక్కుపెట్టిన అస్త్రమే శంఖారావం : మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి - తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 2:29 PM IST
Tanuku Ex- MLA Arimulli RAdhakrishna On Lokesh Shankaravam In West Godavari : అనివార్య కారణాలతో నిలిచిపోయిన యువగళం పాదయాత్రకు ప్రత్యామ్నాయంగా నారా లోకేశ్ శంఖారావం కార్యక్రమం చేపట్టారని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు వైఎస్సార్సీపీ బాధితులేనని, శంఖారావం ద్వారా వారితో మమేకమై సమస్యలు పరిష్కరిస్తామని ఆరిమిల్లి పేర్కొన్నారు.
Lokesh Shankaravam Pada Yatra : చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించి దాదాపు 53 రోజుల పాటు జైలులో ఉంచి లోకేశ్ పాదయాత్రకు వైఎస్సార్సీపీ పలు ఆటంకాలు కలిగించిందని అరిమిల్లి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా ఈ శంఖారావం పూరించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉంటామన్నారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు, రాష్ట్ర అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలపై శంఖారావం ద్వారా ప్రజలందరికీ వివరిస్తారన్నారు.