రెండు లారీల మధ్య నలిగిపోయిన బైక్- భార్యాభర్తలు మృతి- చిన్నారులు సేఫ్ - tamil nadu salem lorry crushed bike
🎬 Watch Now: Feature Video
Published : Jan 30, 2024, 10:29 AM IST
Tamil Nadu Lorry Bike Accident : రెండు లారీల మధ్య నలిగిపోయి ఓ వ్యక్తి, అతడి భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్‌లో బైక్‌పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ లారీ వెనుక భార్యాభర్తలు ఆగగా- వెనక నుంచి మరో లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. తమిళనాడు సేలం జిల్లాలోని మెట్టూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బైక్‌పై అళగరసన్(30), అతడి భార్య ఇలమతి(25)తో పాటు వారి కుమారులు కిశోర్(5), కృతిక్(2) ఉన్నారు. అదృష్టవశాత్తూ వారి కుమారులు ప్రాణాలు దక్కించుకున్నారు.
ఆదివారం భార్యాపిల్లలను అళగరసన్ తన అత్తగారింటికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. బైక్‌పై వీరంతా రమణ్ నగర్‌కు చేరుకోగానే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అళగరసన్ తన బైక్‌ను ఓ లారీ వెనక ఆపిన క్షణాల్లోనే వెనక నుంచి వచ్చిన మరో లారీ వారిని ఢీకొట్టింది. వరి లోడుతో వచ్చిన కర్ణాటకకు చెందిన ఆ లారీ ఎలాంటి హారన్ కొట్టకుండానే వేగంగా బైక్‌పైకి దూసుకెళ్లింది.
దీంతో అళగరసన్, ఇలమతి అక్కడికక్కడే చనిపోయారు. కిశోర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మెట్టూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అనంతరం అతడిని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. భార్యాభర్తల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న కరుమలై కూడల్ పోలీసులు పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మెట్టూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇన్సూరెన్స్‌లో నామినీగా చేర్చలేదని SDM హత్య- కట్టుకథతో బయటపడేందుకు భర్త యత్నం