రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు - వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే - Temperatures in Telangana
🎬 Watch Now: Feature Video
Published : Apr 13, 2024, 12:59 PM IST
Summer Tips to Save From Heat waves : వేసవిలో ఎండతీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఈసారి రాష్ట్రంలో నలభై డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రులు సైతం వేడి ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే ఎండకాలం వస్తే చాలు వడదెబ్బకు ప్రజలు అతలాకుతలం అవుతుంటారు. ఇక ఈసారి ఎండలు మరింత ఎక్కువని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది.
Temperatures in Telangana : సమ్మర్లో చిన్నపాటి పనులకు నీరసించి పోతుంటాం. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. వీటి బారి నుంచి రక్షించుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ తినడంతో పాటు రోజుకు మూడు లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా పది వయస్సులోపు పిల్లలని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కేవలం ఆహార విషయంలోనే కాకుండా ధరించే దుస్తుల్లో సైతం కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు అనే అంశాలను డాక్టర్ శశికిరణ్‌ను అడిగి తెలుసుకుందాం.