LIVE : సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ - SI Passing Out Parade Live - SI PASSING OUT PARADE LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2024, 9:56 AM IST
|Updated : Sep 11, 2024, 11:51 AM IST
CM Revanth in Police Passing Out Parade Live : తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల మూడో బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతోంది. పోలీస్ అకాడమీలోని సుదర్శన్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ల భర్తీ మూడుసార్లు జరిగాయి. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పూర్తైంది. 2023 బ్యాచ్‌కు చెందిన వీరికి 9 నెలల పాటు జరిగిన ట్రైనింగ్ ఇచ్చారు. వీరిలో టాప్ ర్యాంక్‌లో నిలిచిన వారికి ముఖ్యమంత్రి బహుమతులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్ ఉన్నతాధికారులు, అకాడమీ సిబ్బంది, శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎస్సై ఆపై స్థాయి అంటే గ్రూప్-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. వీరిలో సివిల్ ఎస్ఐలు 401 మంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీ వ్యవహరించారు.
Last Updated : Sep 11, 2024, 11:51 AM IST