కమ్‌బ్యాక్ సునీత విలియమ్స్- కర్నూలులో చిన్నారుల ఆందోళన - Students Rally For Sunita Williams - STUDENTS RALLY FOR SUNITA WILLIAMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 4:43 PM IST
Students Rally For Sunita Williams in Kurnool : అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్ , బుచ్ విల్ మోర్ క్షేమంగా భూమికి చేరుకోవాలని కర్నూలులోని మాన్టిసరీ సీనియర్ సెంకడరీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులతో వ్యోమగామలను భూమిమీదకు తీసుకురావాలని నినాదాలు చేశారు. జూన్ 5న రోదసీలోకి వెళ్లిన వ్యోమగాములు 8 రోజుల్లోగా తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో మరికొన్ని నెలలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తుందన్న ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు 'కమ్ బ్యాక్ సునీతా విలియమ్స్' అంటూ నినాదాలు చేశారు.
ఇది ఇలా ఉండగా వీరి యాత్ర పై నాసా కీలక నిర్ణయం తీసుకోనుంది. 8 రోజుల అంతరిక్ష యాత్ర కాస్త సాంకేతిక సమస్యల వల్ల 8 నెలల యాత్ర అయ్యేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఏడుగురు వ్యోమగాములు ఉండగా అక్కడ ఆరు స్లీప్ క్యాబిన్లే ఉంటాయని రోదసీ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే స్పేస్‌ఎక్స్ రాకెట్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వారికి మరింత ఆహారాన్ని, దుస్తులను మోసుకెళ్లింది.