విశాఖపట్నంలో నడిరోడ్డుపై విద్యార్థుల బాహాబాహీ - Students Fight in Visakha - STUDENTS FIGHT IN VISAKHA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 8:54 PM IST
Students Fight in Road at Gopalapatnam : రెండు కళాశాలల విద్యార్థులు రోడ్డుపై బాహాబాహీకి దిగిన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చూస్తుంటే ఏదో సినిమా ఘాటింగ్ జరుగుతుంది అనుకుంటే పొరపాటే. కాలేజీలో చదువుతున్న విద్యార్థులే అయినా వాళ్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల కురిపించుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలకు ఏం జరుగుతుందో తెలియరాలేదు. అనంతరం స్థానికులు వెళ్లి రెండు కళాశాల విద్యార్థులను విడిపించారు. ఈ సంఘటన విశాఖ పశ్చిమలోని గోపాలపట్నంలో చోటు చేసుకుంది.
విద్యార్థులు నడి రోడ్డుపై గొడవకు దిగిన విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం అక్కడికి చేరుకున్నారు. దీంతో వాళ్లంతా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టూ పక్కల వారిని ప్రశ్నించారు. అనంతరం ఎందుకు దాడి చేసుకున్నారో తెలుసుకునేెందుకు పోలీసులు విచారణ చేపట్టారు. సినిమా తరహాలో విద్యార్థులు నడిరోడ్డుపై ఘర్షణకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అసలు ఎందుకోసం గొడవ పడ్డారో అనేది తెలియాల్సి ఉంది.