గురువుకు ప్రేమతో - టీచర్ ఎక్కిన వాహనాన్ని లాగుతూ, పూలు చల్లిన విద్యార్థులు - Students Emotional Viral Video - STUDENTS EMOTIONAL VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 29, 2024, 7:49 PM IST
|Updated : Jun 29, 2024, 7:57 PM IST
Students Crying on Retirement Teacher in Suryapet : గురువులను దైవంలా చూసే సన్నివేశాలు ఎక్కడో సినిమాల్లోనూ చూస్తుంటాం. కానీ అటువంటి సంఘటనే నిజజీవితంలో ఆవిష్కృతమైతే ఎలా ఉంటుందో కదా! సరిగ్గా అదే జరిగింది సూర్యాపేటలో, గురువు ఎక్కిన వాహనాన్ని తాడుతో లాగుతూ, దారిపొడవునూ పూలు చల్లుతూ తమ గురు భక్తి చాటుకున్నారు అక్కడ విద్యార్థులు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో విద్యాబుద్దులు నేర్పించి ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా కృషి చేసిన ఓ గురువుకు అరుదైన గౌరవం దక్కింది. పట్టణంలోని పాఠశాలలో తూము హన్మంతరావు వ్యాయామ ఉపాధ్యాయునిదా 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
తన ఉద్యోగ ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థులకు వారు ఉన్నత శిఖరాలు ఎదగడానికి మార్గదర్శకుడయ్యారు. ఆయన శిష్య బృందంలో పీఈటీలు, పోలీసులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ గురువును ఘనంగా సన్మానించుకున్నారు. పాఠశాల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫంక్షన్ హాల్ వరకు వాహనంపై ఉంచి పూలు చల్లుతూ, తమ గురు భక్తి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై గురుభక్తి చాటుకున్నారు. అదేవిధంగా తమ గురువు ఉద్యోగ విరమణ పట్ల పలువురు భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు.