విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలి : మంత్రి నారా లోకేశ్ - Teachers Unions Meet Lokesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 9:54 PM IST
Teachers Unions Leaders Meet Nara Lokesh : రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని లోకేశ్ విమర్శించారు.
Minister Lokesh on Education Department : మళ్లీ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని మంత్రి లోకేశ్ కోరారు. గతంలో మాదిరి ఉపాధ్యాయులపై అనవసరమైన పనిభారం, వేధింపులు ఉండవని తెలిపారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. అంతకుముందు లోకేశ్ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖలమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలను పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్ మొదటి సంతకం చేశారు.