Gold Rate Today November 22nd 2024 : దేశంలో బంగారం ధరలు పెరగ్గా, వెండి ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,780 ఉండగా, శుక్రవారం నాటికి రూ.960 పెరిగి రూ.79,740గా ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.92,850 ఉండగా శుక్రవారం నాటికి రూ.370 తగ్గి రూ.92,480గా ఉంది.
- Gold Price In Hyderabad November 22nd 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.79,740గా ఉంది. కిలో వెండి ధర రూ.92,480గా ఉంది.
- Gold Price In Vijayawada November 22nd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,740గా ఉంది. కిలో వెండి ధర రూ.92,480గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 22nd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,740గా ఉంది. కిలో వెండి ధర రూ.92,480గా ఉంది.
- Gold Price In Proddatur November 22nd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,740గా ఉంది. కిలో వెండి ధర రూ.92,480గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లుగా ఉండగా, శుక్రవారం నాటికి 30 డాలర్లు పెరిగి 2686 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.93 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 22nd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Updates November 22nd 2024 : అదానీ వ్యవహారంతో గురువారం నష్టాలను చవిచూసిన మార్కెట్లు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 610.97 పాయింట్లు పుంజుకుని 77.766.76 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 185.8 పాయింట్లు ఎగబాకి 23,535 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.49 వద్ద ప్రారంభమైంది.
ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, విప్రో సంస్థల సూచీలు లాభాల్లో ఉన్నాయి. టైటాన్ కంపెనీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, లార్సెన్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది.