ఎస్సారెస్పీ కాలువలకు మొదలైన నీటి విడుదల - Sriram Sagar Water to Canals - SRIRAM SAGAR WATER TO CANALS
🎬 Watch Now: Feature Video
Published : Aug 7, 2024, 3:24 PM IST
Sriram Sagar Water to Canals : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. జలాశయం ఆయకట్టు పంటలకు సాగునీరు అందించడం కోసం ఇవాళ ప్రాజెక్టుకు చెందిన కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు ఒక వెయ్యి క్యూసెక్కుల నీటిని, సరస్వతీ కాలువకు వంద క్యూసెక్కులను, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1080.40 అడుగుల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ఎగువ నుంచి 12,650 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ఠ నీటి నిల్వ 80 టీఎంసీలకు గాను 46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎగువ భాగంలో వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి తొందరలోనే చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖరీఫ్ పంటకు డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.