Bhadradri Live : భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవం - Bhadradri Live - BHADRADRI LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 16, 2024, 7:15 PM IST
|Updated : Apr 16, 2024, 8:42 PM IST
Bhadradri Live : శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. సుమారు నలభై ఏళ్లుగా సంప్రదాయంగా ఉంది. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారు. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా భద్రాచలం ఆలయం విశిష్టత, ఆచార సంప్రదాయాలు సమాజంలో అంతర్లీనమయ్యాయి. దక్షిణాదిలోనే ప్రత్యేకత ఉందని, శ్రీరామచంద్ర స్వామి చతుర్భుజ రాముడిలా దిగివచ్చారని భక్తులు విశ్వసిస్తారు. కుల, మత, జాతులకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణ మహోత్సవానికి హాజరవుతారు. భద్రాద్రి రామయ్య కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న వేళ, ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారాముల కల్యాణం వీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో కదలివస్తున్నారు. కల్యాణ క్రతువులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అర్చకుల వేదమంత్రాలు, భక్తుల సందడి మధ్య ఈ వేడుక వైభవంగా సాగుతోంది.
Last Updated : Apr 16, 2024, 8:42 PM IST