వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు- 650 కలశ బిందెలతో గ్రామోత్సవం - Chowdeshwari Devi Festival - CHOWDESHWARI DEVI FESTIVAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 5:12 PM IST
Sri Chowdeshwari Devi Festival Celebrations: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని నాగులకట్ట వద్ద కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 650 కలశం బిందెలతో పెద్ద ఎత్తున మహిళలు గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నాగలకట్ట వీధి నుంచి పలగాడి వీధి, మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్ వీధి, తాడిపత్రి రోడ్డు మీదుగా ఈ గ్రామోత్సవం కొనసాగింది. ఉత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, లక్ష దీపాలంకరణ సేవ, ఏకాదశి మంగళహారతులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి వేషధారణల నృత్యాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చౌడేశ్వరి దేవి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.