అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికతపై విద్యార్థులకు అవగహన- కార్యక్రమంలో ఎంపీ కేశినేని - Space Technology Awareness Camp

🎬 Watch Now: Feature Video

thumbnail

Space Technology Awareness Conference In Tummalapalli Kalakshetram : అంతరిక్ష పరిశోధనలు మనం సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ది పదంలో ముందకెళ్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్‌ అన్నారు. చద్రయాన్-3 విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించిన నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికతపై విద్యార్థులకు అవగహన కల్పించేందుకు వారం రోజుల పాటు అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చనే అంశంపై అవగాహన సద్సుసు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు, వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు రూపోందించిన పలు ప్రయోగాలను స్టాల్స్​లలో ప్రదర్శించారు. ఈ స్టాల్స్​ను ఎంపీ కేశినేని శివనాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాబోయో తరానికి ప్రతి ఒక్కరికి అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యత తెలిసేందుకు ఈ అవగాహన సదస్సులు దోహదపడుతయాని ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు.
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.