వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని క్యూఆర్టీ సభ్యులు ఎలా కాాపాడారో చూడండి - Tekmal Gunduwagu of Medak district - TEKMAL GUNDUWAGU OF MEDAK DISTRICT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 5:36 PM IST

Updated : Sep 3, 2024, 7:50 PM IST

Tekmal Gunduwagu of Medak district: మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు పొంగిపొర్లుతుండగా వాగును దాటడానికి ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయి, వాగులో ఓ బండరాయిని పట్టుకొని మధ్యలో ఆగిపోయాడు. వాగు మధ్యలో కొట్టుకుపోతున్న వ్యక్తిని మెదక్ క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీం) సభ్యులు గమనించారు. దాంతో ఇద్దరు సభ్యులు, ఓ పోలీసు కానిస్టేబుల్ తాడు సహాయంతో కల్వర్టు మధ్యలోకి చేరుకొని ముగ్గురు ఒక జట్టుగా ఏర్పడ్డారు. ఆ వ్యక్తిని గుండు వాగు వరద ప్రవాహం నుంచి బయటకు తీసుకొచ్చారు. 

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పొంగిపొర్లుతున్న గుండు వాగులో చిక్కుకున్న 45 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సభ్యులను జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్ అభినందించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయి. గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని భద్రతా సిబ్బంది పదేపదే చెబుతున్నారు. అయినా కొంతమంది పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Last Updated : Sep 3, 2024, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.