ఎవరి తలరాతను వారే రాసుకునేందుకు ఏకైక బ్రహ్మాస్త్రం ఓటు - Social activist awareness for vote
🎬 Watch Now: Feature Video
Social Activist Awareness to People use Right to Vote : ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల తలరాతను వారే రాసుకునేందుకు అందుబాటులో ఉన్న బ్రహ్మాస్త్రం కేవలం ఓటు మాత్రమే అన్నారు. అలాంటి ఓటుని వినియోగించుకోవడంలో విద్యావంతులూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అది సరైంది కాదని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులు ఓటుని ఉపయోగించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అధికంగా నమోదు అవుతుందంటున్నారు.
దీన్ని బట్టి చూస్తే విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నది స్పష్టం అవుతుందని కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఓటు వేయడానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్న ఈ రోజుల్లో ఎందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారో ఆలోచించాలని కోరుతున్నారు. ఒక్క ఓటుతోనే ఎంతో మంది నాయకుల తరరాతలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ అవసరమైనన్ని బస్సులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ప్రజలందరూ ముందుకు రావాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.