కడపలో 650 సెల్ఫోన్లు రికవరీ - బాధితులకు అందజేత - Smart Phones Recovery in YSR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2024/640-480-20649107-thumbnail-16x9-smart-phone.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 6:01 PM IST
Smart Phones Recovery in YSR Kadapa District : చోరీకి గురైన స్మార్ట్ఫోన్ల రికవరీలో వైఎస్ఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. గత ఆరు నెలల్లో చోరీకి గురైన స్మార్ట్ ఫోన్లను పోలీస్ ఐటీ సెల్ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన 650 సెల్ఫోన్లు రికవరీ చేశారని తెలిపారు. రికవరీ చేసిన స్మార్ట్ ఫోన్లను కడప పోలీస్ మైదానంలో ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
SP Handed Over the Recovered Cell Phones to the Victims : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మార్ట్ఫోన్లను తిరిగి పొందవచ్చు అని సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. ఫోన్ పొగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఐఆర్ ట్రాకింగ్ ద్వారా పోయిన స్మార్ట్ ఫోన్లును రికవరీ చేస్తామని తెలియజేశారు. స్మార్ట్ ఫోన్లు కొనేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకొని తమ వద్ద జాగ్రత్తగా పెట్టుకోవాలని బాధితులకు అవగాహన కల్పించారు.