ఒకే చక్రంతో కన్యాకుమారి టు కశ్మీర్ సైకిల్ రైడ్- ఎందుకంటే? - Single Wheel Bicycle Ride - SINGLE WHEEL BICYCLE RIDE
🎬 Watch Now: Feature Video
Published : Apr 2, 2024, 2:14 PM IST
Single Wheel Bicycle Ride In Karnataka : ఒకే చక్రంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాడు ఓ యువకుడు. కేవలం వెనక చక్రంతో మాత్రమే సైకిల్ నడుపుతున్నాడు. అతడే కేరళలోని కన్నూర్‌కు చెందిన సతిన్.
గతేడాది డిసెంబర్ 15న సనిత్ మరో ఇద్దరు యువకులు తాహిర్, అభిషేక్‌తో కలిసి కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్ యాత్రను ప్రారంభించాడు. 'సే నో టు డ్రగ్స్' అనే థీమ్‌తో ఈ యాత్రను కన్యాకుమారి నుంచి మొదలు పెట్టాడు. అయితే సనిత్ మాత్రమే ప్రత్యేకంగా ఒకే చక్రం ఉన్న సైకిల్‌పై రైడ్ చేస్తున్నాడు. కశ్మీర్ వరకు అలాగే ఒకే చక్రంతోనే వెళ్లనున్నాడు. అయితే మధ్యలో తాహిర్‌కు ఛాతిలో నొప్పి రావటం వల్ల వెనక్కి వెళ్లిపోయాడు. ఇటీవల సనిత్, అభిషేక్ కర్ణాటకలోని కారవారకు చేరుకున్నారు. ఆ తర్వాత గోవాకు వెళ్లి అక్కడ నుంచి కశ్మీర్‌కు ప్రయాణం కొనసాగించనున్నారు. సనిత్ చేస్తున్న ఈ సాహసాన్ని చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు.