ఓటర్ల జాబితాలో ఇంటి నంబర్ల మాయజాలం - అక్రమంగా ఓటర్ల నమోదు - Single Digit House Name Voter List
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 5:22 PM IST
Single Digit House Name Votes in Voter List: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటరు జాబితాలో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన తుది ఓటరు జాబితాలో ఇంటి నంబర్లు హాట్ టాపిక్‌గా మారిన దృశ్యాలు అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో చోటు చేసుకున్నాయి. ఎన్. తిమ్మాపురం గ్రామంలోని 14వ పోలింగ్ కేంద్రంలో 650 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఇంటి నంబర్ 1-105లో పది ఓట్లు, 1-48 ఇంటి సంఖ్యతో పది ఓట్లు, ఇంటి నంబరు మూడుతో పది ఓట్లు ఉన్నాయి.
సాధారణంగా ఇంటి నంబర్లు అనేవి సింగిల్ డిజిట్‌తో ఉండవు కానీ ఇక్కడ ఓటర్ల జాబితాలో మాత్రం సింగిల్ డిజిట్‌తో ఉన్న ఇంటి నంబరును అధికారులు నమోదు చేశారు. ఓటరు జాబితాలో సింగిల్ ఇంటి నంబరుతో ఓట్లు నమోదు కావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఓటరు జాబితాలో పేర్లు తప్పులతడకగా వెలుగుచూస్తున్నాయి. బతికి ఉన్న వారి ఓట్లు లేకుండా చనిపోయిన వ్యక్తుల ఓట్లు సైతం జాబితాలో ఉండటంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.