'ఐదేండ్లకు ఒక్కసారి వస్తది - తప్పకుండా వాడుకోండి' - ఓటు హక్కుపై తన పాటతో అవగాహన కల్పిస్తున్న వల్లంపట్ల - Awareness to People on voting - AWARENESS TO PEOPLE ON VOTING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 4:40 PM IST

Awareness To The People On Right To Vote : ఓట్ల పండుగ వచ్చేసింది. అధికారులు పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మిగిలిందల్లా మన బాధ్యత. అది ఓటేయడమే. పాటల ద్వారా, మాటల ద్వారా ఎందరో కళాకారులు ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటర్లలో చైతన్యం కలిగిస్తున్నారు. హనుమకొండకు చెందిన ప్రముఖ రచయిత, గాయకుడు వల్లంపట్ల నాగేశ్వరరావు పాటలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరుతున్నారు. ఓటింగ్ రోజున సెలవుగా భావించకుండా పనులెన్ని ఉన్నా, అన్నింటినీ పక్కన పెట్టి ఓటేయడానికి ముందుకు రావాలని, పోలింగ్ శాతం పెంచేందుకు దోహదం చేయాలని, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరుతున్నారు. ఓటు హక్కును వినియోగించి సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వాారా సమాజాభివృద్ధికి తోడ్పడవచ్చని చెబుతున్నారు. కాగా ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల కమిషన్​ పూర్తి చేసింది. మరికొన్ని గంటల్లో పోలింగ్​ జరగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.