మేడారం వీరవనితలు సమ్మక్క సారలమ్మల ఖ్యాతి చాటేలా కళాకారుడి పాట - Warangal Artist Songs on Medaram
🎬 Watch Now: Feature Video
Published : Feb 20, 2024, 7:15 PM IST
Singer Srinivas Face 2 Face Interview : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర రేపు ప్రారంభం కానుంది. ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు సాగుతుంది. వనం నుంచి జనంలోకి వచ్చిన దేవతలను చూసి భక్తులు మైమరచిపోతారు. తనివి తీరా తల్లులను చూసి ఆనందంతో ఇంటికి చేరుతారు. మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు ఇప్పటికే మేడారానికి పోటెత్తుతున్నారు. జంపన్న వాగు జనసంద్రంగా మారే ఘట్టం సమీపించింది.
Warangal Artist Songs on Medaram : అడవి బిడ్డల ఉనికి కోసం, పోరు సల్పిన వీరవనితలు సమ్మక్క సారలమ్మల ఖ్యాతి మాటల్లో చెప్పనలవి కాదు. ఎందరో కళాకారులు తమ పాటలతో ఆ తల్లులకు నీరాజనాలు పులుకుతున్నారు. అలాంటి వారిలో ఒకరు వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, మేడారంపై తన పాటలతో సమక్క-సారలమ్మ తల్లలకు నిరాజనం పలుకుతున్నారు. మేడారం గొప్ప చరిత్ర గురించి తన పాటల రూపంలో మలచి అందరినీ ఆకట్టుకుంటున్నారు.