ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకుంటున్నారా - ఈ నిబంధనలు పాటిస్తే వీసా ఈజీ! - SIG CEO Preethi Kona Interview - SIG CEO PREETHI KONA INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 5:23 PM IST
SIG CEO Preethi Kona Interview : ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల కోసం భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. లక్ష్య సాధన కోసం ఏటా వేలల్లో యువత ఆ దేశానికి పయనం అవుతుంటారు. అయితే ఇప్పటికే అక్కడికి వెళ్లి పైచదువులకు దరఖాస్తు చేసుకునే యువతకు వీసా విషయంలో నిబంధనలు కఠినతరం అయ్యాయి. ఈ మేరకు వీసా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చింది. తద్వారా అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాలతో నిరవధికంగా దేశంలో ఉండే పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడింది. ఈ నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.
Australia Student Visa Process for Indians : తాత్కాలిక వీసా హోల్డర్లు ఇకపై ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసా కోసం ధరఖాస్తు చేయడం సాధ్యం కాదు. మరి, ఆస్ట్రేలియా ఎందుకీ నిర్ణయం తీసుకుంది? ఎవరెవరిపై ఈ ప్రభావం పడనుంది? భారత్ నుంచి ధరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రతలు ఏంటి? ఎలాంటి యూనివర్సిటీను ఎంచుకుంటే బాగుంటుంది? అనే అంశాలపై ఎస్ఐజీ సీఈవో ప్రీతీ కోణా మాటల్లో తెలుసుకుందాం.