తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజెక్షన్ వికటించి 20 మందికి అస్వస్థత - people fell ill due to injection
🎬 Watch Now: Feature Video
Several People Fell Ill due to Injection: ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇంజెక్షన్ వికటించి 20 మంది జ్వరపీడితులు అస్వస్థత గురయ్యారు. తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జ్వరాలతో ఇన్ పేషెంట్ వార్డులో 50 మంది చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం డోస్ కింద సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చారు.
అనంతరం 20 మంది జ్వరపీడితులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా రక్తపోటు తగ్గి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన రోగులు, తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అప్రమత్తమైన వైద్యులు తక్షణ చికిత్స అందించారు. వీరిలో ఇంజక్షన్ వికటించడంతో మోల్దుల్ అలీ మొయిన్ (12), షేక్ నాగుల్ మీరా (32) ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మిగిలిన వారు ప్రస్తుతం రోగులు కోలుకుంటున్నారు. రోగుల అవస్థకు గురికావడంపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు ఫోన్లో సూచించారు.