వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక - ఏ పార్టీతోనూ కలవబోమన్న కిషన్ రెడ్డి - Lok Sabha election 2024
🎬 Watch Now: Feature Video
Published : Jan 25, 2024, 7:25 PM IST
Selection Of Candidates For Parliament In BJP : పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక వారం రోజుల్లో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు దోపిడి దొంగల పార్టీలుగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అగ్గిలాంటి పార్టీగా పేర్కొన్న కేంద్రమంత్రి ఏ పార్టీతోనూ కలవదని స్పష్టం చేశారు.
Lok Sabha election 2024 : ప్రతి రోజు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అసదుద్దీన్ ఓ మూర్ఖుడని తెలిపారు. బీజేపీకి ఒకటే జెండా ఓకే దేశం అనే ఒకటే నినాదంతో ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని కిషన్ రెడ్డి అన్నారు. మూడు పార్టీలు అహంకారంతో పనిచేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్నివర్గాల అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.