పెద్దమ్మగుడిలో శాకాంబరి ఉత్సవాలు - మూడ్రోజుల పాటు ఘనంగా వేడుకలు - Shakambari Utsavalu - SHAKAMBARI UTSAVALU
🎬 Watch Now: Feature Video


Published : Jul 13, 2024, 5:26 PM IST
Shakambari Utsavalu in Secunderabad : జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగుతున్నాయి. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ సప్తమి జులై 13వ తేదీ మొదలు ఆషాఢ శుద్ధ నవమి జులై 15 వరకు ఉత్సవాలు జరగనుంది. అయితే శనివారం శాకాంబరి ఉత్సవాల నేపథ్యంలో అంగరంగ వైభవంగా రకరకాల కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. శనివారం ఉదయం 3 గంటలకు అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం హారతి మంత్రపుష్పములు, తీర్థప్రసాదాలు సమర్పించారు.
జీవకోటికి ఆకలిని తీర్చిన శాకాంబరి దేవి : అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసర ప్రాంతం అంతా కిటకిటలాడింది. భక్తశ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ దర్శించుకున్నారు. అమ్మవారిని పూజించడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడిపంటలకు లోటుండదని భక్తుల విశ్వాసం. ఏ కోరికైనా మొక్కుతే అమ్మ తన కొంగు బంగారం చేస్తుందని భక్తులు కొనియాడారు. అందరూ ఆషాఢ మాసంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయానికి వచ్చిన భక్తులు తెలియజేశారు.