LIVE : నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Kishan Reddy Press meet Live - KISHAN REDDY PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 26, 2024, 4:27 PM IST
|Updated : Apr 26, 2024, 4:52 PM IST
BJP Candidate Kishan Reddy Live From State Office : నామినేషన్ల పర్వం ముగియడంతో రాష్ట్రంలో పార్టీల మధ్య విమర్శల పర్వం జోరందుకుంది. అటు ప్రచారంతో పాటు పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మాటల దాడికి దాగారు. నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. నిన్న చేవెళ్లలో జరిగిన రోడ్ షో రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐసీసీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో అన్ని సమస్యలకు మూలం కాంగ్రెస్ పార్టీ అని, దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ పిచ్చి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేనివాళ్లే రిజర్వేషన్లు రద్దు అవుతాయని మాట్లాడతారని హెచ్చరించారు. బ్రిటీషర్ల ఆచార వ్యవహారాలు పాటించేది ఎవరో ప్రజలకు తెలుసని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Last Updated : Apr 26, 2024, 4:52 PM IST