డబ్బు సంపాదనకు అడ్డదారి - గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు అరెస్ట్ - అక్రమంగా 80 కిలోల గంజాయి తరలింపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:14 PM IST
SEB Officials Seize 80KGs Ganja in Anakapally District : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి తిరుపతికి అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా సెబ్ (special enforcement bureau) అధికారులు పట్టుకున్నారు. రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని మంగళగిరి టోల్గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తిరుపతికి చెందిన వారిగా గుర్తించారు.
Ganja Smuggling In Narsipatnam : తిరుపతికి చెందిన నలుగురు వ్యక్తులు గత కొంతకాలంగా గంజాయి తీసుకొచ్చి తిరుపతి, బెంగళూరులో విక్రయిస్తున్నారని (smuggling) సెబ్ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వర రావు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. తక్కువ కాలంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశతో నిందితులు ఈ పనిని ఎంచుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో హోల్‌సేల్‌గా తీసుకుని బయట అమ్ముతున్నారని, బెంగళూర్‌లో సైతం వీరు గంజాయి విక్రయిస్తున్నారని సెబ్ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.