నెక్లెస్ రోడ్లో ఉత్సాహంగా 'శారీ రన్' - ముఖ్య అతిథిగా హాజరైన నారా బ్రాహ్మణి
🎬 Watch Now: Feature Video
Published : Mar 17, 2024, 6:33 PM IST
Saree Run In Hyderabad : బెంగళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్, తనైరా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 'శారీ రన్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హాజరయ్యారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శారీ రన్ కార్యక్రమంలో సుమారు 3 వేల మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైెరెక్టర్ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఫిట్‌గా ఉండేందుకు వాకింగ్, వ్యాయామాలు తప్పనిసరి అని ఆమె సూచించారు. చీర మన సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకువస్తుందని చెప్పారు. గత ముప్పై ఏళ్లుగా హెరిటేజ్ సంస్థ ద్వారా మంచి ఫ్రెష్, హెల్దీ ప్రొడక్టులను వినియోగదారులకు అందించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్న మహిళలు, బ్రాహ్మణితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.