Instant Loan Without Credit Score : మీకు అర్జెంట్‌గా డబ్బులు కావాలా? కానీ క్రెడిట్ స్కోర్ లేదని బ్యాంకులు రుణం ఇవ్వడం లేదా? అయితే ఇది మీ కోసమే. క్రెడిట్ స్కోర్ లేకున్నా ఇన్స్టాంట్ లోన్ పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Instant Loan Without CIBIL Score
- ప్రస్తుతం చాలా ఇన్స్టాంట్ లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా యాప్స్ మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం (ఇన్కమ్ ప్రూఫ్)లను కచ్చితంగా అడుగుతూ ఉంటాయి. మంచి క్రెడిట్ స్కోర్/ సిబిల్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే, రుణం అందిస్తుంటాయి. కానీ కొన్ని యాప్స్ మాత్రం క్రెడిట్ స్కోర్ లేకున్నా కూడా లోన్స్ మంజూరు చేస్తుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు.
నోట్ : నేడు ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. నకిలీ లోన్ యాప్‌లు రుణగ్రహీతలను నిలువునా దోచుకుంటున్నాయి. మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. కనుక మోసపూరిత లోన్ యాప్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- మీకు సిబిల్ స్కోర్ లేనంత మాత్రాన ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆదాయం కంటే చాలా తక్కువ మొత్తం కోసం మీరు అప్లై చేయవచ్చు. దీని వల్ల మీరు సకాలంలో ఈఎంఐ చెల్లించగలరని బ్యాంకులు విశ్వాసం ఏర్పడుతుంది. కనుక మీకు త్వరగా లోన్ మంజూరు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
- సిబిల్ స్కోర్ లేనప్పుడు, మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపించవచ్చు. ఒక వేళ మీరు ఫ్రీలాన్సింగ్, వ్యాపారం లాంటి పనులు చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉంటే, మీ ఆదాయానికి సంబంధించిన వివరాలను బ్యాంకులకు అందించాల్సి ఉంటుంది. ప్రతీ నెలా కచ్చితంగా ఆదాయం సంపాదిస్తున్న వారికి, అంటే స్టడీ ఇన్కమ్ ఉన్నవారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. కనుక ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు.
- మీరు లోన్ కోసం అప్లై చేసేటప్పుడు, క్రెడిట్ స్కోర్ కాలమ్‌లో NH లేదా NA అని రాయవచ్చు. ఎన్‌హెచ్ అంటే 'నో హిస్టరీ' అని అర్థం. ఎన్ఏ అంటే 'నో హిస్టరీ అవైలబుల్' అని అర్థం. వీటి ద్వారా గత 36 నెలలుగా మీరు ఎలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయలేదని బ్యాంకులకు తెలుస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, మీకు ఎలాంటి రుణాలు లేవని అర్థం అవుతుంది. కనుక మీకు కొత్తగా ఇన్స్టాంట్ రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
- మీకు స్వయంగా క్రెడిట్ స్కోర్ లేనంత మాత్రాన ఏం భయపడాల్సిన పనిలేదు. మీరు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారిని సహ-దరఖాస్తుదారు(కో-అప్లికెంట్)గా పెట్టుకోవచ్చు. దీని వల్ల ఇన్స్టాంట్ లోన్ త్వరగా మంజూరు అయ్యే ఛాన్స్ పెరుగుతుంది.
నోట్ : క్రెడిట్ స్కోర్ లేని సందర్భాల్లోనూ మీకు లోన్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కచ్చితంగా అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. అదే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, కచ్చితంగా తక్కువ వడ్డీ రేటుకే, త్వరగా రుణం మంజూరు అవుతుంది.
Benefits Of A Good CIBIL Score
సిబిల్ స్కోర్ అనేది ఒక మూడు అంకెల సంఖ్య. ఇది 300 - 900 పాయింట్ల మధ్య ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ 700 -900 పాయింట్ల మధ్య ఉంటే దానిని మంచి స్కోర్‌గా చెప్పుకోవచ్చు.
- సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారికి త్వరగా లోన్స్ మంజూరు అవుతాయి.
- తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది.
- రుణ మొత్తం ఎక్కువగా ఉన్నప్పటికీ లోన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కూడా త్వరగా వస్తాయి. రుణానికి సంబంధించిన నియమ, నిబంధనలు కూడా చాలా వరకు సరళంగా ఉంటాయి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడమే మంచిది.