రోడ్డు ప్రమాదంలో నన్ను బతికించింది హెల్మెటే : సాయి ధరమ్ తేజ్ - Commissioner on Traffic Awareness
🎬 Watch Now: Feature Video
Published : Feb 12, 2024, 9:56 PM IST
Sai Dharam Tej about Traffic Awareness : అంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగినా తాను మళ్లీ బతికి బయటపడ్డానంటే అది హెల్మెట్ పెట్టుకోవడం వల్లేనని సినీ నటుడు సాయిధరమ్ తేజ్ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ముఫఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు.
Traffic Awareness in Muffakham Jah College : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు ఇచ్చారు. సీటు బెల్టు,హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని హీరో సాయి ధరమ్ తేజ్ వారికి సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల కేవలం మన ప్రాణాలే కాకుండా ఎదుటివారినీ కాపాడినవారమవుతామని తెలిపారు.