నీటి సరఫరా కార్యాలయంలో దస్త్రాలు చోరీ - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - Files Theft in palasa
🎬 Watch Now: Feature Video
Water Supply Department Office Files Theft in Palasa : శ్రీకాకుళం జిల్లా పలాసలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పాత కార్యాలయంలో దస్త్రాలు చోరీ అయినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. కార్యాలయం వెనక ఉండే కిటికీని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. లోపల ఉన్న దస్త్రాలను మూటలు కట్టి తుక్కు దుకాణంలో అమ్మేశారు. విషయం తెలుసుకున్న అధికారులు కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. నీటి సరఫరా విభాగంలో దస్త్రాలు చోరీ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా తుక్కు దుకాణంలో ఉన్న మూటలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పలాసలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా విభాగ కార్యాలయాన్ని అనకాపల్లికి తరలించారు. పాత కార్యాలయానికి తాళాలు వేసి ఉంచారు. ఇదే అదునుగా భావించిన కొంత మంది వ్యక్తులు దస్త్రాలు చోరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీ చేసిన దస్త్రాలన్నీ పోలీసులు రికవరీ చేశారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.