సీఎం సభకు బస్సులు- ప్రయాణికులకు తిప్పలు - బస్సుల తరలింపుపై టీడీపీ నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 1:34 PM IST
RTC Buses Transport for Cm Meeting TDP Leaders Protest In Ananatapur District : అనంతపురం జిల్లాలో రేపటి సీఎం పర్యటనకు కుప్పం ఆర్టీసీ బస్సుల తరలింపుపై టీడీపీ నాయకులు నిరసన (Protest) తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సులను రేపు సీఎం సభకు (CM Meeting) తరలించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. డిపో వద్దకు శ్రేణులు చేరుకొని డీఎంను నిలదీశారు. డిపోలో 66 ఉంటే 50 బస్సులను సభకు తరలిస్తే మిగతా 16 బస్సులలో ప్రయాణీకులు (Passengers) వారి గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలని నేతలు ప్రశ్నించారు.
ఎప్పుడు సీఎం సభ నిర్వహించినా తమకు సమస్యలేనంటూ బాధితులు వాపోతున్నారు. బస్సులు (RTC Buses) లేక ప్రయాణాలకు చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చిందని, మళ్లీ ఇప్పుడు బస్సుల తరలింపు అంటే ఎలా అని వాపోతున్నారు. సీఎం సభ అంటె ఇక మేము ఏ పనులు చేసుకేలేమని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.