ఎన్నికల్లో పారించేందుకు 4వేల లీటర్ల మద్యం - పకడ్బందీగా పట్టుకున్న పోలీసులు - LIQUOR SEIZED IN HYDERABAD - LIQUOR SEIZED IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-05-2024/640-480-21366469-thumbnail-16x9-liquor.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 2, 2024, 11:25 AM IST
RS.37 Lakhs Worth Liquor Seized in Hyderabad : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు విస్తృత సోదాలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. అనధికారికంగా తరలిస్తున్న వాటిని సీజ్ చేస్తున్న అధికారులు వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించి రవాణా చేస్తున్న రూ.37 లక్షల విలువ గల నాలుగు వేల లీటర్ల మద్యాన్ని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. బాచుపల్లి పీఎస్ పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న 2597.88 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 1916.2 లీటర్ల మద్యంతో పాటు మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎటువంటి క్యూ ఆర్ కోడ్ లేకుండా రూ.1.24 లక్షల రూపాయలను తరలిస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.