LIVE : కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ప్రెస్ మీట్ - BSP Praveen Kummar Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 3:58 PM IST

Updated : Mar 5, 2024, 4:04 PM IST

RS Praveen Kumar KCR LIVE :  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉండగా ఆ తర్వాత బీజేపీలోకి వలసలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల వరుసగా నాయకులు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో పార్టీ గందరగోళానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలా లేక పార్టీలోనే కీలక నేతలను బరిలో దింపాలా అనే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన ఇరువురు నేతలు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్- బీఎస్పీ మధ్య పొత్తుపై మాట్లాడుతున్నారు.
Last Updated : Mar 5, 2024, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.