రౌడీమూకలపై ముందస్తుగా జిల్లా బహిష్కరణ వేటు - Rowdy Sheeters Expelling Kadapa
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 10:27 AM IST
Rowdy Sheeters Expelling from Kadapa District : ఈ నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా కడప జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని కొందరు రౌడీమూకలపై ముందస్తుగా జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 మందిని బహిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా నేటి నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో ఉండరాదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు జిల్లాల్లో దాదాపు 1700 మందిపై రౌడీషీట్ తెరిచి గృహనిర్బంధం చేయనున్నారు.
ఇప్పటికే రౌడీషీటర్లందరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు, శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లా వదలాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 6వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటాయన్న జిల్లా ఎస్పీ, ఎవరైనా బయటి వ్యక్తులకు, గుర్తు తెలియని వ్యక్తులకు, పాత నేరస్థులకు ఆశ్రయమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.