క్షమించు దుర్గమ్మా నీ నగలు కొట్టేస్తున్నా - అమ్మవారికి మొక్కుకుని మరీ చోరీ చేసిన దొంగ - Robbery at Kanaka Durga Temple
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 12:42 PM IST
Robbery at Kanaka Durga Temple in Rangareddy : దొంగతనం చేసేందుకు ఏకంగా గుడినే ఎంచుకున్నాడు ఓ ఘనుడు. ఎవరూ లేని సమయం చూసి ఎంచక్కా ఆలయంలోకి ప్రవేశించిన ఆ దొంగ, అమ్మవారిని మొక్కి మరీ దొంగతనం చేశాడు. ఇవన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లుర్‌లోని కనకదుర్గ దేవాలయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kanaka Durga Temple Robbery : ఓ దొంగ అమ్మవారిని మొక్కి మరీ దొంగతనం చేశాడు. కర్ర సహాయంతో కనకదుర్గ అమ్మవారి మెడలో ఉన్న మూడు తులాల మంగళసూత్రం ఎత్తుకెళ్లాడు. దొంగ చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీని ఎవరు చేశారు, స్థానికులా లేక బయటి వ్యక్తులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.