కూలీ పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి - నామ్ రహదారిపై రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2024/640-480-20753823-thumbnail-16x9-road-accident-in-nam-highway-three-people-dead.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 7:19 AM IST
Road Accident in Nam Highway Three People Dead: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు- నామ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.
కూలిపనులు చేసుకొని ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు తిరుపతి నుంచి పిడుగురాళ్ల వైపు వెళుతుండగా ఏల్చూరు గురుకుల పాఠశాల వద్దకు వచ్చే సరికి ముందు కూలీలతో వెళుతున్న ఆటోని ఢీకొట్టడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. రహదారి పర్యవేక్షక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు మధ్యలో నిలిచిపోయి ప్రమాదానికి కారణమైన కారును క్రేన్ సాయంతో పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏల్చూరుకు చెందిన అటో డ్రైవర్, ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.