ఘోర రోడ్డు ప్రమాదం - కారు, ఆటో ఢీ- ముగ్గురు మృతి - Road Accident at Suryapet - ROAD ACCIDENT AT SURYAPET
🎬 Watch Now: Feature Video
Published : Apr 4, 2024, 10:00 PM IST
|Updated : Apr 4, 2024, 10:23 PM IST
Road Accident at Suryapet : మరికొద్ది సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటామని అనుకునే లోపు ఓ రోడ్డు ప్రమాదం కొన్ని కుటుంబాలకు కన్నీళ్లను మిగిల్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో రెండేళ్ల వయసున్న చిన్నారి ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం 14 మంది ప్రయాణికులతో అరవపల్లి మండల కేంద్రం నుంచి సూర్యాపేటకు వస్తుండగా సూర్యాపేట శివారులో ఈ ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టడంతో ముందు నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇందులో రెండేళ్ల చిన్నారి ఉంది. మిగిలిన క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టామని సూర్యాపేట డీఎస్పీ తెలిపారు.