లైవ్ వీడియో : బైక్‌ను ఢీ కొన్న కారు - ఎగిరిపడ్డ తండ్రీకూతురు - Road Accident at Shamirpet - ROAD ACCIDENT AT SHAMIRPET
🎬 Watch Now: Feature Video


Published : Aug 27, 2024, 8:49 AM IST
Road Accident at Shamirpet : మితిమీరిన వేగంతో వచ్చిన కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో వాహనదారులు తీవ్రంగా గాయపడిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి బిహార్ రాష్ట్రానికి చెందిన పంకజ్ రామ్, అతని కుమార్తె పూజ కుమారి ద్విచక్ర వాహనంపై తుర్కపల్లి వైపు నుంచి యాడారం వైపు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు అతివేగంతో వెళ్తున్న టాటా హరియర్ కారు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తండ్రి గోపాల్, కుమార్తె పూజ ఇద్దరు ఎగిరి కాస్త దూరంలో పడ్డారు.
ఈ ఘటనలో వారిద్దరికి తీవ్రంగా గాయలయ్యాయి. గమనించిన వాహనాదారులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అదించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన దృష్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.